భాష నిఘంటువులు సాంబనిఘంటువు (ఆంధ్రనామనిఘంటువు)
అవతారిక
సీ. శ్రీ వెలయంగ దే-శీయముల్‌ దెనుఁగులుఁ
దద్భవంబులుఁ గూర్చి - దైవవర్గు
దనరు మానవవర్గు - స్థావరవర్గు తి
ర్యగ్వర్గు నను నాలు - గలవరించి
జల్లు లుంపక వ్యర్థ-శబ్దముల్‌ రానీక
కుంటినడత గాక - కొదుకు లేక
యుర్వీజనంబుల - కులకారసరణిగా
నాంధ్రనామనిఘంటు - వనెడుకృతినిఁ
 
తే. గవులదయచేత నీకటా-క్షంబువలన
సీసశతకంబుఁ జెప్పెదఁ - జిత్తగింపు
డనుజసమవర్తి భక్తహృ-దబ్జవర్తి
సకలసురచక్రవర్తి శ్రీ-సాంబమూర్తి.
1
AndhraBharati AMdhra bhArati - sAMbanighaMTuvu - bhAshha - nighaMTuvulu - sAMba nighaMtuvu AMdhranAmanighaMTuvu ( telugu andhra )