| భాష | నిఘంటువులు | సాంబనిఘంటువు (ఆంధ్రనామనిఘంటువు) |
| స్థావరవర్గు | ||
| కం. |
శ్రీవరదాయక పాయక దేవరనామాంకితముగఁ - దేటపఱచెద\న్ స్థావరవర్గును గవితా భావరసజ్ఞు లెద మెచ్చఁ - బశుపతి సాంబా. |
1 |
| సీ. |
ఇలతాల్పు గట్టు గు-బ్బలి కొండ మల తిప్ప యన శైలనామంబు - లమరు మంచు టిలతాల్పు వడఁకుగు-బ్బలి దుగ్గికన్నయ్య గట్లరాయఁడు బేసి-కంటిమామ చలికొండ వలిమల - పులుచూలితాత నా హిమగిరినామంబు - లెఁసగుఁ బసిఁడి గట్టు వేల్పులమన్కి-పట్టు క్రొన్నెనదారి సింగిణి యన మేరు-శిఖరివొల్చు |
|
| తే. |
విసపుమేఁతరి బలుటెంకి - వెండికొండ తెలిమల యనంగ రజతాద్రి - తేజరిల్లు బటువుమల తుదగ ట్టన - బరఁగు జక్ర వాళగిరిపేర్లు త్రిభువన-వంద్య సాంబ. |
2 |
| సీ. |
కవ్వపుమల తరి-గ ట్టన మందరం బడరుఁ దూరుపుమల - పొడుపుఁదిప్ప మొదటికొండ యనంగ - నుదయాచలం బొప్పుఁ బడమటిమల క్రుంకు-పుడమితాల్పు నా నస్తగిరి కగు - ఱాయి ఱా క ల్లన బ్రస్తరాఖ్య దలిర్చుఁ - బల్లె యూరు కుప్పం బనఁగ గ్రామ - మొప్పును బ్రోలు వీ డనఁ బట్టణముపేరు - లలరుచుండు |
|
| తే. |
నిరవు టెంకి యునికి యిక్క - యిల్లు గీము మనికిపట్టు బిడారు కొంప - యిలు నెలవు నట్టు ఠా వన మందిర-నామము లగు శంబరాహితమదభిదా-డంబ సాంబ. |
3 |
| సీ. |
టెంకాయచె ట్టన - టేమ్రాను నారిక డం బన నారికే-ళంబు దనరుఁ దా డనఁ దాళ మౌ - దాళిమ్మ దానిమ్మ యన దాడిమియుఁ బొన్న - పొన యనంగఁ బున్నాగముఁ దనర్చు - గన్నేరు గన్నెరు నాఁగను గరవీర-నామము లగు రేఁగు రే నన బద-రికిఁ జెల్లు మారెడు బిలువ మనఁ దనర్చు - బిల్వమునకు |
|
| తే. |
జమ్మి జం బన శమి యగుఁ - జంపకంబు దనరు సంపెఁగ సంపఁగె - యనఁగ నెల్లి యుసిరి యుసిరిక యన ధాత్రి - కొప్పు రాగి యనఁగ రా వన నశ్వత్థ - మొనరు సాంబ. |
4 |
| సీ. |
అత్తి మేడి యనంగ - నౌదుంబరం బొప్పు మావి మామి డన నా-మ్రము దనర్చు వెలఁగ వెలంగ నా - వెలయుఁ గపిత్థంబు మల్లె మల్లియ నాఁగ- మల్లిక యగు జాజి జాది యనంగ - జాతి యౌ నేరేడు నేరెడు నా జంబు - నెగడుచుండుఁ బాదిరి కలిగొట్టు - నాఁ దగుఁ బాటలి పొగడ పొవ డన నొ-ప్పును వకుళము |
|
| తే. |
మ్రాఁకు మ్రాను చెట్టనఁగ ద్రు-మంబు చెలఁగు తీఁగ తీఁగియ లతకూన - తీఁగె యనఁగ దనరు లతపేరు పూవులు - ననలు విరులు పువ్వు లలరులు నా సుమం-బు లగు సాంబ. |
5 |
| సీ. |
మొక్క మోటికి మోసు - మోక మొలక యన నంకురనామంబు - లలరు నిగురు తలిరు చిగురు నాఁగఁ - దగుఁ బల్లవాఖ్యలు కొన తుద యన నగ్ర-మునకుఁ బొల్చుఁ దొఱ తొలి తొఱ్ఱి నాఁ దరుకోటరం బొప్పుఁ దమ్మి తామ రనఁ గం-జమ్ము పరఁగు దొగ తొవ కలు వనఁ - దగు నుత్పలమునకు దట్టంబు జొంపంబు - తఱుచు జీబు |
|
| తే. |
గుమురు తంపర యన నిబి-డము దనర్చు మొగడ మొగ్గ యనం దగు - ముకుళమునకు నిక్షుకాండంబునకుఁ బేరు - లెసఁగు చెఱకు కనులుగలమ్రాను తియ్యమ్రా - ననఁగ సాంబ. |
6 |
| సీ. |
తెలుపు తెల్లన తెల్ల - తెలి వెల్ల వెలి యన ధవళవర్ణ మెసంగుఁ - దొవరు తొగరు కెంజాయ యెఱు పెఱ్ఱ - కెం పన రక్తవ ర్ణమగు నల్లన కఱి - నల్ల కప్పు నలు పన నీలవ-ర్ణము పొల్చుఁ జామనఁ బసరుచా యన శ్యామ - మెసఁగుచుండు నళిది పసు పనంగ - నగుఁ బీతవర్ణంబు తేట నున్నన నున్న - తెలివి నునుపు |
|
| తే. |
నిద్ద మన స్నిగ్ధత కెసంగు - నిగ్గు డాలు మినుకు మిన మించు నిగ తళ్కు - మెఱుఁగు చికిలి కళుకు జిగి రంగు మెఱ పనఁ - బొలుచుఁ గాంతి నొడ్డు దరి గ ట్టనఁగఁ గూల - మొనరు సాంబ. |
7 |
| సీ. |
ఆణి చినుకుఁబూస - పాని సుప్పాణి ము త్తెము ముత్తియంబు ము-త్య మనఁ దనరు మౌక్తికాఖ్యలు కెంపు - మానికము రతన మనఁగ మాణిక్యాహ్వ-యంబు లలరుఁ బగడము పవడం బ-నఁగ విద్రుమము పొల్చుఁ బక్కిరాయనిఱాయి - పచ్చ యనఁగ మరకతము దలిర్చు - మగఱాలు మూలఱా లన వజ్రము లగుఁ బు-ల్లంటు ఱాయి |
|
| తే. |
కప్పుఱాయి యనఁగ నీల - మొప్పుఁ బిల్లు పూరి చిగిరింత యేట్రింత - పొనుఁగు గడ్డి గఱిక పచ్చిక వెణుతురు - కసవు తుంగ విడవలి యనఁ దృణాఖ్యలు - వెలయు సాంబ. |
8 |
| సీ. |
ఎల్లి చుట్టువు గొడు - గెండమఱు వనంగ ఛత్రంబు దనరు ధ్వ-జంబుపేళ్లు టెక్యము టెక్కెము - టెక్కియము సిడంబు పడగ డా లనఁ జెల్లు - నిడివి నిడుద సోగ నిడువు చాఁపు - నాఁగ దీర్ఘమున కౌ మఱుఁగు చా టోలము - మఱు వనంగ దగుఁ బిధానాఖ్యలు - జగతి జగిలె తిన్నె యరుఁ గన వేదిక - కమరు నేల |
|
| తే. |
ఇల పుడమి మన్ను బువి పంట-వలఁతి యనఁగ ధరణి కగు విప్పు వెడలుపు - విరివి పఱఁపు వెడఁద యన విస్తరాఖ్యలు - వెలఁయు బైరు ససి యనఁగ సస్యనామము - లెసఁగు సాంబ. |
9 |
| సీ. |
మోడు మొరడు మొద్దు - మో టన స్థాణు వౌ బొఱియ కలుఁగు బొక్క - బొంద లోయ యన బిలాఖ్యలు చెల్లు - నడుసు బురద ఱొంపి యస లనఁ బంకాఖ్య - లెసఁగు మడుఁగు మడు వన హ్రద మొప్పుఁ - బొడ వన నున్నతం బగు గోడ యనఁగ గు-డ్యంబు పొల్చు సోరణగం డ్లన - మీఱు గవాక్షము మాడుగుల్ మిద్దెలు - మచ్చు లనఁగ |
|
| తే. |
దారునిర్మితగృహము లౌఁ - దరకసంబు బత్తళిక పొది దొన యనఁ - బరఁగు దూణి పెట్టి మందసమును పెట్టె - పెట్టియ యనఁ బేటికాభిఖ్య లగు గుణ-పేటి సాంబ. |
10 |
| సీ. |
ఎన జోడు మాదిరి - యీడు పురుడు మాద్రి సాటి పాటి తరంబు - దీటు దినుసు సరి యుద్ది ప్రతి దిన్సు - సవతు పోలిక దొర జత యనఁగా సదృ-శమున కెసఁగుఁ బల్లకి పల్లకీ - పాలకి పాల్కి నాఁ బల్యంకికాఖ్యలు - పరఁగు లాలి యుయ్యాల యుయ్యేల - యూయెల తొట్ల జో ల యనంగ డోలికా-హ్వయము లెసఁగుఁ |
|
| తే. |
గంకటియు మంచ మనఁ జెల్లు - ఖట్వమునకుఁ బీఁట పలక యనఁగ నొప్పుఁ - బీఠమునకు బరణియుఁ గరాట మనుపేళ్లు - భరణి కమరు నిచ్చెన యనంగఁ నిశ్రేణి - నెగడు సాంబ. |
11 |
| సీ. |
ఉలి యు క్కిను మనఁగ - నొనరు నయస్సంజ్ఞ చెంబు రాగి యనఁ దా-మ్రం బెసంగుఁ దగరము కరుగు డ-నఁగ సీసము రహించు కాంస్యంబు వర్తిల్లుఁ - గం చనంగఁ ద్రపునామ మమరుఁ బి-త్తళి యిత్తళి యనంగఁ గుండలు చట్లు మూఁ-కుళ్లు బుడ్లు కడవలు బానలు - పిడతల్ వెస ళ్లన భాండముల్ తగు నాఁచు - పాఁచి యనఁగ |
|
| తే. |
శైవలం బగు నూతులు - బావు లనఁగ వెలయుఁ గూపంబులకు గుంట - కొలను కొలఁకు తిరుకొళం బన సరసికిఁ - బరఁగు వాఁక యేఱు వంక వాఁ గనఁ బేరు - లెసఁగు సాంబ. |
12 |
| సీ. |
మీల్ మీలు చేఁపలు - మీనులు తెఱగంట్లు మచ్చెము లనఁ జెల్లు - మత్స్యములకుఁ దాఁబేలు తామేలు - నాఁ బొల్చుఁ గూర్మము నెం డ్రెండ్రకా యన - నెసఁగుఁ గర్కి యోడ కల మనంగ - నొనరు నావకు వాన జడి ముసు రనఁగ వ-ర్షమున కలరు వానఱాల్ వడగండ్లు - నా నొప్పుఁ గరకలు నిసు మన నిసు కన - నిసు వనంగ |
|
| తే. |
మెఱయు సైకతనామముల్ - కురుజుతేనె పుట్టతేనియ పెరతేనె - పువ్వుఁదేనె జుంటితేనియ యనఁ దగు - సుమరసంబు శంబధరనుత సుగుణక-దంబ సాంబ. |
13 |
| సీ. |
జముకాణము తివాసి - జంబుకాణ మనంగఁ గంబళాఖ్య లగు బం-గారు హొన్ను జాళువా పుత్తడి - మేలిమి బంగరు పసిఁడి పొన్ను కడాని - పైఁడి యుదరి యన సువర్ణము వొల్చు - నపరంజి కుందనం బనఁ దప్తకనక మౌఁ - దునుక తునియ చిదురుప చిదురు నాఁ - జెలఁగు ఖండమునకుఁ బొది ప్రోగు వామియుఁ - బ్రోవు తిట్ట |
|
| తీ. |
కుప్ప యన రాశి కగు సంజ్ఞ - యుప్పరిగయు మహలు మేడ యనంగ హ-ర్మ్యమగుఁ ద్రోవ దారి తెన్ను తెరు వనఁ బ-థంబు వెలయు రవ రజం బన లవముపే-ళ్లవును సాంబ. |
14 |
| సీ. |
అడవి కాన యనంగ - నటవికిఁ దగు హౌసు తోఁట సింగారపుఁ-దోఁట నంద వన మనంగను నుప-వన మొప్పు నడబావి డిగ్గియ దొరు వన - దీర్ఘికి తగుఁ బవ్వళింపు బిడారు - పడుకటి ల్లనఁ గేళి గృహ మగు బోనపు-టిల్లు వంట యిల్లు సువారంపు-టి ల్లనఁ బాకమం దిరము రాజిలు దగ-తీర్పు చల్ల |
|
| తే. |
పంది లనఁ జలిపంది ల-నం దనర్చు సలిలశాలాభిధలు నీరు-చల్ల నీరు మజ్జిగయు జలతక్రనా-మములు విసన కఱ్ఱ వీవన యన వృ-తంక మగు సాంబ. |
15 |
| కం. |
భువి నీస్థావరవర్గును సవరణ వ్రాసినను వినినఁ - జదివిన యమ్మా నవులను విద్యామతియై భవశాలురఁ గా నొనర్పు - పశుపతి సాంబా. |
16 |