| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
143. చిన్నవాడు - చిన్నది
| వీరిద్దరూ అనుకూలురు. ఆ ఉత్సాహము బాగుగా తెలుస్తుంది చూడండి. |
| 1 |
|
చక్కని గుంటా । రాయె నా యెంటా సరస కూచుంటా । పెళ్ళి చేసుకుంటా గుఱ్ఱాన్నెక్కిస్తా । కూడా నేనొస్తా సఱ్ఱూన వూరంత । సైదిరిగి వత్తాము ॥చ॥ |
| 2 |
|
నే కులాస గుంటా । నిన్నంటా నిన్నే పెళ్ళాడతా । నంటా నాకు నీకు జోడంటా నాకేమి పెట్టకు । తంటా ॥చ॥ |
| 3 |
|
చేపల బుట్ట । చంకనెట్టి సందెడు పూసలు । మెళ్ళో బెట్టి కోపుగ కాట్రేడు । చీరను గట్టి గోటేసిన రవిక । తొడిగబెట్టి ॥చ॥ |