| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | బ్రాహ్మణాదివర్ణనము |
| సీ. | బ్రహ్మాహ మనఁబోయి భంగమొందిన శుచి - ద్విజవాహనుని సద్వివేక మెంత? యనిశంబు దోషాకరుని మౌళి ధరియించు - ధర్మాభియాతి ప్రతాపమెంత? ఘనతర స్వర్ణముల్ గలిగియు మకరసం - గతినున్న యక్షేశు కలిమి యెంత? యేఱు వ్రయ్య లొనర్చి యూరు డయ్యఁగఁ జేసి - మలయు లాహిరికాని మహిమ యెంత? | |
| గీ. | యని చతుర్ముఖ చండీశ ధనద సీర ధరుల సుజ్ఞాన ధర్మ సత్పణ్య కృషివి శేషముల మెచ్చ రప్పురిఁ జెలఁగు ద్విజశి ఖామణులు రాజు లూరుజుల్ గాపుఁ బ్రజలు | 15 |