| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
అన విని ధర్మసూనుఁడు కృతాంజలి యై తగ భీష్ము డాయ న ల్లన చని, కేలఁ బాదకమలంబు లమర్చి శిరంబు సోఁక వం దన మొనరించినం, బిలిచి తా నభినందితుఁ జేసి మస్తకం బునఁ గడు నర్మిలిం దనదు మో మిడి మూర్కొని సాదరంబుగన్. |
156 |
| వ. | భీష్ముం డాభీమాగ్రజుం గూర్చుండం బనిచి, ‘శంకింపక న న్నేమి యైన నడుగు’ మనిన నమ్మహీపతి మాధవునకుం బ్రణమిల్లి, పారాశర్య ప్రభృతి మునివరులకు నభివాదనం బాచరించి , సర్వకౌరవుల యనుమతి వడసి, యప్పితామహున కభిముఖుం డై నమస్కరించి యి ట్లనియె. | 157 |
| చ. |
‘అరయఁగ రాజధర్మము సమాశ్రయ మై నడపుం ద్రివర్గమున్ గురుతర మోక్షధర్మమునకుం దలఁపం దనప్రాప యూఁత భూ వర! విను ఘోటకంబునకు వాగెయు, దంతికి నంకుశంబు నే కరణి నివారకంబులు జగంబుల కట్టుల తాను నెమ్మెయిన్. |
158 |
| క. |
వ్యాకులతఁ బొంది రూపఱు | లోకస్థితి తొంటిరాజలోకముచే నం గీకృత మగు ధర్మ మనం | గీకృత మగునేని వీతకిల్బిషచరితా! |
159 |
| క. |
తరణి వొడిచి తమము సెఱుచు | కరణిని లోకమునఁ గలుగు కల్మష మెల్లన్ ధరణిపతి ధర్మ మాత్మ | స్ఫురణంబునఁ జెఱుచు విమలబోధనచరితా! |
160 |
| ఆ. |
అనఘ! నీదు బుద్ధి యతిలోక మగుటయుఁ | దెలిసికొనఁగ నాకు వలయునట్టి ధర్మకోటి నీవ తగఁ జెప్ప వినవల | యుటయుఁ జెప్పె నంబుజోదరుండు. |
161 |
| ఆ. |
ధర్మవిదులు రాజు ధర్మ స్వరూపుఁగాఁ | జెప్ప విందుఁ దద్విశేషవృత్తి భరముగాఁ దలంతు నరవర! చెప్పవే | మున్ను రాజ ధర్మముల తెఱంగు.’ |
162 |
| చ. |
అనుటయు నాపగేయుఁడు మహత్త్వ సమంచిత మైన ధర్మము న్వినుత విధాతృభావ మహనీయుఁడు గృష్ణుని, వేదమూర్తి నాఁ జను ధరణీసురావలిఁ బ్రసక్తిఁ దలంచి నమస్కరించి, య జ్జనపతి వక్త్ర మాదర రసప్లుత దృష్టిని జూచి యిట్లనున్. |
163 |
| క. |
‘నృపధర్మము లన్నియు నీ | కుపదేశించెద విసంశయోక్తుల; మఱియున్ విపులఫలవంత మగు ధ | ర్మపథంబును నడుగునెడఁ గరము వివరింతున్. |
164 |
| వ. | అవహితమతివై యాకర్ణింపుము. | 165 |
| ఆ. |
మేలు దనకుఁ గోరు మేదినీశుఁడు మున్ను | దేవతలకు భూమిదేవతలకుఁ బూజ యాచరించు నోజ యత్నముఁ జేయ | వలయు రెండు గార్యఫలకరములు. |
166 |
| మ. |
విను ముద్యోగము రెంటి యందుఁ బర ముర్వీనాథ! యుద్యోగవం తునకున్ దైవము దోడ్పడంగ ఫలసిద్ధుల్ సేకుఱున్; మానుషం బున కొక్కొక్కెడ సిద్ధి దప్పిన వగల్ వొందంగరానీక య ప్పని దైవోపహతంబుగాఁ గనుట భూపాలార్హ వృత్తంబగున్. |
167 |
| క. |
దాంతియు విజితాత్మత్వము | శాంతియు శీలంబుఁగలుగు జగతీశుఁడ శ్రీ మంతుండు యశస్వియు నై | యెంతయు సౌఖ్యంబు నొందు నిభపురనాథా! |
168 |
| తే. |
ప్రకృతు లేడింటి నెఱి నడపంగ వలయు; | దాని కార్జవ సత్యముల్ దావలములు; దండనీతి విధాన మంతటికి రక్ష; | యర్హ మగు మెల్పుతోఁ జేయ నది వెలుంగు. |
169 |
| వ. | అదియును బుద్ధిమంతులు బ్రాహ్మణులవలనం బ్రయోగింప; రయ్యర్థంబునకు మనువాక్యంబులు గల; వాకర్ణింపుము. | 170 |
| ఆ. |
ఇనుము ఱాత, నీర ననలంబు, విప్రుల | వలన రాజు, లుద్భవంబుఁ బొందు టిది నిజంబు; తత్సమిద్ధ తేజము లెందుఁ | జెల్లుఁ బుట్టినెడలఁ జేటు నొందు. |
171 |
| క. |
శిలఁ ద్రెంపఁబోయి యినుమును | జలములు గొని కాల్పఁగడఁగి చని యనలంబుం బొలియును; రాజును విప్రుల | కలిగి చెఱుపఁబోయి తాన యనయంబుఁ జెడున్. |
172 |
| శా. |
ఈ వాక్యంబులు రెండుఁ జిత్తమున నీ వెల్లప్పుడున్ నిల్పి భూ దేవశ్రేణియెడం గృపాన్వితుఁడవై దీప్తార్హ దండంబు స ద్భావం బొప్పఁగ నొండెడన్ నడపు శాంతక్ష్మా సురోదార జి హ్వా విశ్రాంతము బ్రహ్మ మట్లగుట దైవం బండ్రు విప్రున్ బుధుల్. |
173 |
| వ. | విప్రుని దండించు నెడలునుం గలవు; శుక్రుండును జెప్పినవాఁడు; వినుము. | 174 |