| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
సులభాభిధాన యగునొక | లలన విమలయోగధర్మ లంపటు జనకుం గెలన విని యతని బోధము | కొలఁది పరీక్షింపఁ దనకుఁ గోర్కి వొడమినన్. |
170 |
| వ. | నియమాచరణకృశం బగు శరీరంబు యోగప్రభావంబున డాఁచి సుందరసుకుమారం బగు నాకారంబు వహించి జనకుం గాంచి భిక్షావృత్త్తిత్వ సూచకంబు లగు వచనంబు లుపన్యసించిన నతం డాసనపాద్యార్చనంబు లాచరించి మహనీయంబగు భోజనం బొనర్చిన సంతృప్తిం బొంది యవ్విదేహపతికి నాసన్నంబగు నుచితాసనంబున నాసీనయైయుండి యాతండు ముక్తుండగుఁ గామిఁ గనుఁగొను తలంపున నిజానుభావంబున నతని చిత్తంబు ప్రవేశించి మారవికారంబు భావించి. | 171 |
| క. |
తన లోచనదీప్తుల న | మ్మనుజపతి మొగంబునందు మల్లడిగొనఁ జే సిన నమ్మహాత్ముఁ డప్ప | ద్మనయన తలఁ పెఱిఁగి జనిత మందస్మితుఁడై. |
172 |
| ఆ. |
‘ఎచటినుండి యెచటికేఁగెద? వెవ్వరి | దాన? వేమి వెంటఁ దగిలి నడతు సుదతి! నాకుఁ జెప్పు మది యట్టులుండె నా | మాట వీవు విను సమాదరమున. |
173 |
| సీ. |
పంచశిఖుండను పరమమునీశ్వరు | శిష్యుండ నతనిచే శిక్షితంబు గమలాక్షి సాంఖ్యయోగక్షితి పాలనం | బులఁ ద్రివిధంబగు మోక్షధర్మ మట్లుగావున సంశయము లేక ముక్తకా | మస్థితి నమ్మూఁడు మార్గములను నడచి పరంబున కెడపడకుండుదు | ముక్తి వైరాగ్యైకమూల సూవె |
|
| తే. |
విను విరక్తి దృఢ జ్ఞానజనిత గాన | దీపిత జ్ఞానమును విరక్తియు ధరింపఁ బడిన బుద్ధి నిర్ద్వంద్వత బరఁగు నింటి | యంద నిల్చి నిస్సంగుఁడనై చరింతు. |
174 |
| క. |
వనితా! చందనమునఁ బూ | సినఁ గత్తిని వ్రేసినను సుచిత్తత నా క జ్జను లిరువురయందును సరి, | కనకము లోష్టమును సమమ కాఁ గనుగొందున్. |
175 |
| తే. |
జ్ఞానమును గర్మమును రెంటి సంగమంబు | నిష్ఠలుగ మోక్షవిదులు వర్ణింతు రాత్మ శాస్త్రములు గని మద్గురుశాసనంబు | సుగమపదము తృతీయంబు సూవె యబల! |
176 |
| ఆ. |
కీడుగని యొకండు గృహధర్మ ముడిగి స | మాశ్రయించు నాశ్రమాంతరంబు దాన సంగ ముడుగఁగా నేర దదియొల్ల | మియును వలపుగాన మీననయన! |
177 |
| క. |
దండముఁ గాషాయంబును | ముండితయుఁ గమండలువును మోక్ష మొసఁగ వె ట్లండేని లింగములకు న | ఖండజ్ఞాన ప్రదత్వకలనము గలదే? |
178 |
| క. |
మగువా! దుఃఖము శిథిలం | బగునని లింగములు దాల్తు రమ్మెయి లే దె ట్లు? గొడుగునందుం గావున | వగవఁగ మోక్షదముగాఁగ వలయున్ గొడుగున్. |
179 |
| ఆ. |
జ్ఞానమునన కాని మానిని! లింగమా | త్రమున ముక్తి యగునె? రాజ్యబంధ రాగబంధ నిఖిల భోగబంధములఁ బ్ర | జ్ఞాసిఁ దునిమినాఁడ నది గతముగ. |
180 |
| వ. | ఇట్లు ముక్తుండ నైయున్న నాయెడ ముక్తత్వాముక్తత్వంబు లారయవేఁడి వచ్చి మచ్చిత్తంబు మెత్తన చొచ్చి తిదియ ప్రయోజనం బట్లుంగాక. | 181 |
| తే. |
బ్రాహ్మణివి యోగినివి పరభార్య వబల! | భర్త ప్రోషితుఁ డేను నృపాలసుతుఁడ వినుము గృహమేధి నాచారఘనుఁడ నిట్టి | నేను నీవు రమించుట నిందఁ దేదె? |
182 |
| వ. | స్వతంత్రవై నీవు చేసిన యీ యవినయంబున నెయ్యది వాటిల్లిన నది నీయంద నిలుచుం గాక!’ యని పలికి వెండియు. | 183 |
| క. |
‘నావలని రాగముననే | నీవిట్లైతి నను గెల్చు నిపుణతకుం గా కీ వెడమాయల నిప్పుడుఁ | బో విడువవు యోగశక్తి పొలుపు కలిమినే. |
184 |
| క. |
నిను డాఁచి కుటిలభావం | బున దుష్టచరిత్రవైతి ముక్తుల తెఱఁగే వనిత! యిది యే బయలుపఱి | చిననైనను మానవలదె చెన్నఁటిచూపుల్?’ |
185 |
| క. |
అని తన వైరాగ్యంబును | ఘనబోధము మహిమయుం బ్రకాశింప మనం బున సరకుగొనక యి ట్ల | వ్వనితఁ బలికి యన్నరేంద్రవర్యుఁడు మఱియున్. |
186 |
| క. |
తను వొప్పెడునది యౌవన | మును నూతన మిట్టి నీకుఁ బొలఁతీ! యోగం బున నింతచొరవ యెమ్మెయిఁ | బనుపడియెం జెపుమ! దాఁపఁ బనిలే దింకన్.’ |
187 |
| వ. | అనుచు. | 188 |
| క. |
తను సరకుసేయ కి ట్ల | జ్జననాథుఁడు వలుక నవ్వచనములు దెలియన్ విని సులభ చతురముగ ని | ట్లను నించుక గొంకులేక యవ్విభుతోడన్. |
189 |
| క. |
‘శ్రోతకుఁ దనకుం బ్రియమగు | నే తెరువున నట్టిమెయి సమీరిత మైనం జూ తగు వాక్యం బది నృప | సూతీ! పెఱపలుకు బాలిశుల చొ ప్పరయన్. |
190 |
| వ. | భవదీయ వాక్యవైదగ్ధ్యం బట్లుండె నీవు నన్నెవ్వరిదాన? వెచ్చటినుండి వచ్చి? తెటుపోయె?దని తొలుత నడిగి తవహితుండవై వినుము చెప్పెద. | 191 |