| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| ఉ. |
మర్దితతాపసంకలన మంజులనామ! దురంత దుర్దశా కర్దమలేప నిర్హరణకారి కృపామృత పూర! కర్మసం మర్ద నిరాస కర్మఠ! సమత్వ పరిస్ఫుట రూప భావనా నిర్దళితారి వర్గ! మహనీయ! మనోరమణీయవైభవా! |
454 |
| క. |
భసిత పరభాగ! హేలా | లసిత శ్రీవత్స లలిత లాంఛన! పింఛ ప్రసృమర రుచి శబలోరగ | విసృమర దీధితి కలాప వేష్టిత మౌళీ! |
455 |
| మాలిని |
క్షరణరహిత వృత్తీ! గ్రాహ్యభక్త ప్రవృత్తీ! కరణ గమన లీలా! గాఢకారుణ్య శీలా! స్మరణ శుభదమూర్తీ! మధ్యరశ్మి ప్రవర్తీ! చరణ వినమదింద్రా! సంతతానంద సాంద్రా! |
456 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవి మిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీమహాభారతంబున భీష్మపర్వంబునందు సర్వంబును తృతీయాశ్వాసము. | 457 |
| శ్రీమదాంధ్ర మహాభారతమునందలి భీష్మపర్వము సమాప్తము. | ||