| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
అమ్మెయి సూతుఁ డీల్గుటయు నగ్గలికం గద వుచ్చుకొంచు రౌ ద్రమ్మున వచ్చు శల్యుఁ గని తానును జండ గదా విలాస నో గ్రమ్ముగ లీల మార్కొనియె రమ్మిట రమ్మనుచున్ సమస్త సై న్యమ్ములుఁ బిచ్చలింపఁగ సురాధిప పౌత్రుఁడు దీప్త గాత్రుఁడై. |
180 |
| ఉ. |
అంతకు భీమసేనుఁడు రయం బెసఁగన్ గద నెయ్ది పట్టి య త్యంత బలంబుమైఁ బిఱిఁది కాతనిఁ ద్రోచి కనద్గదాపరి భ్రాంతి వెలుంగ నిల్చినఁ దిరంబయి శల్యుఁ డుదాత్తరేఖఁ గా లాంతక దీప్తమూర్తి యగు నాతనిఁ దాఁకె బలంబు లార్వఁగన్. |
181 |
| వ. | అట్టియెడ. | 182 |
| క. |
‘ఇతనికి నితండ యితనికి | నితఁడ యెదురుఁ గాక యొరుల కీ యిరువురయు ద్ధతి కెదుర వశమె’ యనువా | క్తతియును దూర్యస్వనములుఁ గడుఁ బె ల్లెసఁగెన్. |
183 |
| వ. | ఇట్లు దలపడి శల్య సమీరనందనులు మండల ప్రచారంబులను విచిత్ర గదా ప్రసారణంబులను మెఱయుచు. | 184 |
| మ. |
గద లన్యోన్య సమాగతిన్ మిడుఁగుఱుల్ గ్రక్కంగ సారించుచుం గదియం బాయఁగ వ్రేటు దప్ప నుసులంగా నేర్పు లంగంబులం దొదవన్ ఘోర పరస్పర ప్రహతు లత్యుగ్రంబుగా నెత్తురుల్ సెదరింపం బదశబ్ద హుంకృతులు దిక్సీమంబులన్ దాఁటఁగన్. |
185 |
| క. |
పోరెడు నప్పుడు లావును | వీరోద్రేకంబుఁ జలము వెరవును సరియై మారుతియు మద్రపతియు ను | దారగతుల మెఱసి రమరతతి వినుతింపన్. |
186 |
| వ. | ఇట్లు పెద్దయుంబ్రొద్దు పెనంగి. | 187 |
| క. |
అఱిముఱి నొండొరు వ్రేసిన | నెఱఁకులు దాఁకుటయు నొచ్చి నేలఁ కొఱగె బి ట్టఱి యా సుభట ద్వితయము | వెఱచఱచి బలద్వయంబు వెగ డందంగన్. |
188 |
| వ. | అయ్యవసరంబున. | 189 |
| క. |
కృతవర్ముఁడు మద్రమహీ | పతి గ్రక్కున గ్రుచ్చి యెత్తి పాయంగొని యు ద్ధతి వాయఁ జనియె మారుత | సుతుఁ డాలోఁ దెలిసి లేచి శోభిల్లెఁ గడున్. |
190 |
| క. |
గద సారించుచు జయమునఁ | బొదలు నతనిఁ జూచి నీదు పుత్త్రులు గోపం బొదవ నడరి రుద్భటగతి | మదవత్కరి చటుల రథ సమాజంబులతోన్. |
191 |
| వ. | ఇ ట్లడరి వివిధాస్త్ర శస్త్రంబు లేయుచుం బొదివిన. | 192 |
| మ. |
కవలుం దానును నేచి యుద్ధురగతిం గౌంతేయముఖ్యుండు వీ రవరానీకము వీఁకఁ గూడికొని సంరంభంబు శోభిల్లఁ గౌ రవసంఘంబుఁ గలంచినన్ విఱిగె దర్పం బేది నీ సేన య బ్దవితానంబు మహాసమీరణ నిరస్తంబైన చందంబునన్. |
193 |
| వ. | అంత నపరాహ్ణంబయ్యె; నప్పుడు శంఖ భేరీ మృదంగాది తూర్యస్వనంబులు సెలంగ సింహనాదంబులం బేర్చినపాండవ సేనం జూచి వృషసేనుండు రోషావేశభీషణుండై మార్కొని మార్గణనికరంబులు నిగిడించిన. | 194 |
| మ. |
కరిగాత్రంబుల ఘోటకాంగకములం గప్పెన్ సమిద్భూమి య చ్చెరువై యుండఁగ రథ్యసూత రథిక శ్రేణీవపుఃఖండముల్ దొరఁగెం, దుత్తుమురయ్యెఁ గాల్బలము, లస్తోక ప్రవాహంబులై పరఁగెన్ రక్తనదుల్, పిశాచకుల మంభః కేలిలోలంబుగన్. |
195 |
| తే. |
కర్ణనందనుఁ డి ట్లత్యుదీర్ణభంగిఁ | బాండురాజ తనూజుల బలము నెల్లఁ గనుపు గొట్టంగఁ జొచ్చినఁ గినిసి నకులు | నాత్మజుండు శతానీకుఁ డతనిఁ దాఁకి. |
196 |
| క. |
వాలమ్ములు పది మేనం | గీలించిన నాతఁ డతని కేతనము ధరం గూలిచి చాపముఁ ద్రుంచిన | నాలోనన ద్రౌపదేయులందఱుఁ బెలుచన్. |
197 |
| వ. | తోడంబుట్టువునకుం దలకడచి వివిధ విశిఖంబుల వృషసేనుం గప్పిన నశ్వత్థామ ప్రముఖంబై కదిసి, కౌరవానీకంబు శతానీకునిం దత్సోదరుల ననేక క్రూరాస్త్ర నిచయావృతులం జేసినం గని కౌంతేయాగ్రజుండు గడంగి, కేకయ మాత్స్య పాంచాల ప్రభృతి బలంబులతో నురవడించిన, సురాసుర సంగ్రామ సదృశ సమరం బయ్యె; నందు భీమ కర్ణ కృప ద్రోణ ద్రౌణి ధృష్టద్యుమ్న విరాటులు ప్రతాప దీపితులై మార్తాండుండు సప్తమూర్తులు దాల్చి ధరణి విహరించినట్లు వెలింగిరి; కొండొక సేపునకుఁ బాండవ సేనా సాగర సంరంభంబు సహింపం జాలక మన మొన దెరలి మరలినం జూచి యాచార్యుండు గోపాటోపంబును బటువిక్రమంబును నావేశింప నీ సైనికుల నిలు నిలు మని యదల్చి, తూణీరంబు బిగియించి, గుణంబు సారించి, సారథితో నిట్లనియె. | 198 |
| సీ. |
‘చలమేది కౌరవ సైన్యముల్ వాఱెడు | ధర్మనందనుని యుద్దండ వృత్తిఁ గంటె? యీతనిఁ దాఁకి గర్వంబు మాన్పక | నిలిచిన నిమ్మూఁక నిలుచు నెట్లు? ధర్మజ భీమ సాత్యకి మాత్స్యపాంచాల | తత్తనూజులు నాకుఁ దరమె? క్రీడి చాపంబు వెరవు నా చూపినయది గాదె? | విను మట్లు గాకయుఁ దనువు దాఁచు |
|
| తే. |
సమయమే యిది? సంభృతోత్సాహలీల | జయముఁ గీర్తియుఁ గోరి యస్ఖలితభంగిఁ దేరు నడుపుము; చేతుల తీఁట వోవ | నడరి రథిక జనంబు వేఁటాడవలయు.’ |
199 |