| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| మందాక్రాంతము |
వీణానాద ప్రతిమ నిగమావిర్భవత్సార పుణ్య శ్రేణీ సంపాదిత విమలతాస్థేమ నిర్లేపచిత్త త్రాణక్రీడాకలన సతతోత్సాహ వద్దివ్యభావా! ప్రాణాపానాహరణ నిపుణ ప్రాపణీయానుభావా! |
185 |
| క. |
త్వంతాహంతా నిరసన! శాంతాంతఃకరణ యోగిజనవిజ్ఞేయా చింతాసాగరమగ్న | భ్రాంతజనాధ్యేయ! పరమభక్తివిధేయా! |
186 |
| మాలిని |
భరిత నియమచేతః పద్మవిజ్ఞాన కేలీ! పరిమళపరిపాక ప్రౌఢసంపర్కశాలీ! పరిణతికృతదూష్య ద్భంగి భూతాళిహేలా! కరణ భృతి జగత్సంస్కర్తృతానందశీలా! |
187 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున స్త్రీపర్వంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము. | 188 |
| శ్రీమదాంధ్ర మహాభారతంలో స్త్రీపర్వం ముగిసింది. | ||