| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అయోధ్య కాండము |
| భరద్వాజ ముని యాదరాతిథ్యము | ||
| ఉ. |
రాజ కులవతంసుఁ డగు రాముఁడు తమ్ముఁడుఁ దాను నా భర ద్వాజ మహా మునీంద్రు పదవారిజముల్ గని మ్రొక్క, నాతఁడం భోజ హితాన్వయాబ్ధి పరిపూర్ణ సుధాకరుఁడైన రామునిం బూజ లొనర్చి కందఫల మూలములం బరితృప్తుఁ జేసినన్. |
34 |
| వ. | సంతసించుచు నా రాత్రి యచ్చట నివసించి మఱుసటి దిన మర్కోదయమ్మున. | 35 |
| ఆ. |
ముదముతోడఁ దమ్ము ముని భరద్వాజుండు భక్తి ననుప, రామభద్రుఁ డంతఁ జనియె భ్రాతృ దార సహితుఁడై సన్ముని కూటమునకుఁ జిత్రకూటమునకు. |
36 |