| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| హనుమంతుఁడు పెకలించి తెచ్చిన సంజీవని పర్వతము | ||
| క. |
ద్రోణాగ్రి కేఁగి మందులు పోణిమి నీకున్నఁ గినిసి పొల్పలరఁగ నా క్షోణీధర మగలింపుచుఁ బాణితలాగ్రమునఁ బెట్టి పట్టుకరాఁగన్. |
80 |
| సీ. |
కావలి యున్నట్టి గంధర్వగణములు-పదునాల్గువేలు కోపంబుతోడ నాహవం బొనరింప నందఱ నచ్చోట-వాలముఖంబున వసుధఁ గూల్చి గగనమార్గంబునఁ గడుతీవ్రగతితోడఁ-బోవ నందిగ్రామపురమునందుఁ దైలయుక్తం బైన తలలతోఁ బొరలాడ-గలిగిన రామలక్ష్మణుల తెఱఁగు |
|
| తే. |
భరతుఁ డారాత్రి కలఁ గని భయము దోఁచి-తొడరి దుస్స్వప్న దోషంబు దొలఁగి పోవ విప్రవరులకు దానముల్ వేడ్కనిచ్చి-వెలుపలను నున్న భరతభూవిభునిఁగాంచి. |
81 |
| తే. |
రాముఁడే యంచు నూహించి రాముఁ డేల వచ్చు నిచటికి సౌమిత్రి వనచరులను జనకనందనఁ దగ డించి జగ మెఱుంగఁ బరగఁ జంపక రా నేమిపని తలంప. |
82 |