| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| సన్న్యాసి సుభద్రకు శకున శాస్త్రము చెప్పుట | ||
| తే. |
చెలువ! నిను రాజకీరంబు చెట్టవట్టెఁ గలికి! నిను రాజకీరంబు కాలుద్రొక్కె మంచిశకునంబు లివిగొ నామాటఁ జూడు కన్నె! యీలోనఁ బెండ్లిగాఁగలదు నీకు. |
159 |
| క. |
అనవుడు లజ్జావనతా ననతామరస యయి వీరు నాఁగ మహాత్ముల్ తన చేసిన సేవకుఁగా మన మలరి వచించి రనుచు మది నుత్సుక యై. |
160 |