| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | విన్నానమ్మా జననీ నీకథ |
| మణిరంగు - ఆది | |
| పల్లవి: | |
| విన్నానమ్మా జననీ నీకథ లెన్నో భక్తాపన్నరక్షణివైనటు | ॥విన్నా॥ |
| అనుపల్లవి: | |
| అన్నపూర్ణేశ్వరి ఇలలో ఆ కొన్నవారి కమృతాన్నమిడి బ్రోతువని | ॥విన్నా॥ |
| చరణము(లు): | |
| పావన గంగాతీరమందు బరగు వారణాశిపురిని వెలసిన భావజరిపు ప్రియభామినివై భూ భారమణచు రాఘవార్చిత భాగ్యమని | ॥విన్నా॥ |