| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నన్నుబ్రోవ నీకన్న వేరెవ్వ |
| సారంగ - ఆది | |
| పల్లవి: | |
| నన్నుబ్రోవ నీకన్న వేరెవ్వ రున్నారు ఆపన్నరక్షణి ఇలలో | ॥నన్ను॥ |
| అనుపల్లవి: | |
| కన్నతల్లి ఆదిలక్ష్మీ కామేశ్వరి తిన్నగా భవాబ్ధి దాటించి దయతో | ॥నన్ను॥ |
| చరణము(లు): | |
| గుట్టువిడచి సాటి నరుల చెంతజేరి పొట్టకూటికై బొంకులాడగలనా దిట్టరివని నమ్మిన రాఘవుని రట్టుదీర్చు దీనరక్షణివి గావా | ॥నన్ను॥ |