| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | రావమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరి మాయింటిదాక |
| రీతిగౌళ - మిశ్రజాతి చాపు | |
| పల్లవి: | |
| రావమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరి మాయింటిదాక | ॥రావమ్మ॥ |
| అనుపల్లవి: | |
| భావజారి హరిబ్రహ్మేంద్రాది సురగణములగూడి | ॥రావమ్మ॥ |
| చరణము(లు): | |
| రాజిల్లు శరన్నవరాత్రులందు నీసేవ మోజు దీరగజేసి మ్రొక్కెద సాష్టాంగముగ ఈ జన్మమందే నీకృప యేర్పడజూచి రాఘవునిబ్రోవ | ॥రావమ్మ॥ |