| కీర్తనలు | శ్యామా శాస్త్రి | శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి |
| సావేరి - ఆది, తిశ్ర గతి |
| పల్లవి: |
| శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శాంభవి సరసిజభవ వందితే గౌరి అంబ॥ |
| అను పల్లవి: |
| సంకటహారిణి రిపువిదారిణి కల్యాణి సదా నత ఫలదాయికే హర నాయికే జగజ్జనని॥ |
| చరణము(లు): |
| జంబూపతి విలాసిని జగద వనోల్లాసిని కంబు కంధరే భవాని కపాల ధారిణి శూలిని॥ |
| అంగజరిపుతోషిణి అఖిలభువనపోషిణి మంగళప్రదే మృడాని మరాళసన్నిభ గమని॥ |
| శ్యామకృష్ణ సోదరి శ్యామళే శాతోదరి సామగానలోలే బాలే సదార్తిభంజన శీలే॥ |