| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పార్వతి జనని శ్రీ రాజరాజేశ్వరి(గీతమ్) |
| భైరవి - ఖండ మఠ్యమ్ |
| 1: పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి సర్వలోకపాలిని మానిని దేవి నీరజాక్షి పరమపావని కామాక్షి నిరంజని మామవ అంబా॥ |
| 2: శ్రీకరి జనని మృడాని శ్రీ రాజరాజేశ్వరి హ్రీంకారరూపిణి హరిణాక్షి దేవి శ్రీ కాంచీపురవాసిని కామాక్షి శ్రీ కామేశ్వరి మామవ అంబా॥ |
| 3: శాంభవి జనని పురాణి శ్రీ రాజరాజేశ్వరి శర్వరీశ ధారిణి శంకరి దేవి శ్యామకృష్ణ పరిపాలిని కామాక్షి శ్యామళాంబికే మామవ అంబా॥ |