| కీర్తనలు | శ్యామా శాస్త్రి | మరి వేరే గతి ఎవరమ్మా |
| ఆనందభైరవి - మిశ్ర చాపు |
| పల్లవి : |
| మరి వేరే గతి ఎవరమ్మా మహిలో నను బ్రోచుటకు॥ |
| అను పల్లవి : |
| శరణాగతరక్షకి నీవే యని సదా నమ్మితి నమ్మితిని మీనాక్షి॥ |
| చరణము(లు): |
| మధురాపురినిలయా వాణీ రమా సేవితపదకమలా మధుకైటభ భంజనీ కాత్యాయనీ మరాళగమనా నిగమాంతవాసినీ॥ |
| వరమిచ్చి శీఘ్రమే బ్రోవు శివా అంబా ఇది నీకు బరువా నెఱదాతవు నీవు గదా శంకరీ సరోజభవాది సురేంద్రపూజితే॥ |
| శుకశ్యామళ ఘనశ్యామకృష్ణుని సోదరీ కౌమారీ అకళంక కలాధరి బింబాధరీ అపారకృపానిధి నీవే రక్షింప॥ |
| స్వరము(లు): |
| పాదయుగము మదిలో దలచి కోరితి వినుము మదగజగమన పరుల నుతింపగనే వరమొసగు సతతమునిను మది మరవకనే మదనరిపుసతి నిను హృదయములో గతియని దలచి స్తుతి సలిపితే ముదముతో ఫలమొసగుటకు ధరలో నతావన కుతుహల నీ వేగ॥ |