అధ్యాత్మ సంకీర్తన
రేకు: 196-2
సంపుటము: 2-493
రేకు: 196-2
సంపుటము: 2-493
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఇచ్చినవాఁడు హరి పుచ్చుకొన్నవాఁడ నేను చెచ్చెరఁ దగవు లింకఁ జెప్పఁ గదరో | ॥పల్లవి॥ |
| నిలిచినది జగము నిండినది భోగము కలిగె జీవుల కొక్కకాణాచి వలయశాసనాలు వడి నాల్గు వేదములు చలపట్టి జాణలు చదువుకోరో | ॥ఇచ్చి॥ |
| పారినవి మనసులు పట్టినది జననము పోరు దీరెఁ గర్మముల పొలమేర కోరికలె సాక్షులు గుట్టలు త్రిగుణములు వూరుఁ బేరుఁ దెలుసుక వొడఁబడరో | ॥ఇచ్చి॥ |
| దక్కినది ధర్మము తప్పనిది భాగ్యము లెక్కించ నుదుటివ్రాలె లిఖితములు యిక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటికి మూలము చిక్కులు వాపె నితని సేవించరో | ॥ఇచ్చి॥ |


