అధ్యాత్మ సంకీర్తన
రేకు: 198-3
సంపుటము: 2-504
రేకు: 198-3
సంపుటము: 2-504
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఇతని ప్రసాదమే యిన్నియును గతి యితనిదే కన కాదనరాదు | ॥పల్లవి॥ |
| కాయములో నొకఘనసంసారము ప్రాయంబులతోఁ బ్రబలీని ఆయ మందుకును హరి దానేయై దాయక పాయక తగిలున్నాఁడు | ॥ఇత॥ |
| వొనరిన కలలో నొకసంసారము మనసుతోడనే మలసీని ననిచి యందుకును నారాయణుఁడై కొనమొదలై తా గురియైనాడు | ॥ఇత॥ |
| వుడిబడి కోర్కుల నొకసంసారము బడిబడి యాసలఁ బరగీని విడువక యిది శ్రీవేంకటేశ్వరుఁడే తొడిఁబడఁ గల్పించి ధ్రువమయినాఁడు | ॥ఇత॥ |


