అధ్యాత్మ సంకీర్తన
రేకు: 198-6
సంపుటము: 2-507
రేకు: 198-6
సంపుటము: 2-507
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| హరి నారాయణ కృష్ణ అదివో మావిన్నపము తరవాతి మాట నీవే తలఁచుకోవయ్యా | ॥పల్లవి॥ |
| నడిఁబడ్డ తలఁపు చక్కఁగాక వుండినాను వొడయఁడవు నీకృప వొగిఁ జక్కనే గుడిగొన్న యేరెంత కొంకరవంకరలైనా పుడమికి లోఁగొనకపోవునటవయ్యా | ॥హరి॥ |
| కాయకపు నాభక్తి కడుఁ గొంచమైనాను ఆయపు నీవరములు అతిఘనమే యేయెడ గుడి గొంచమయిన గుడిలో దేవుని- కాయెడ మహిమ ఘనమందురు గదవయ్యా | ॥హరి॥ |
| శ్రీవేంకటేశ నిన్ను జింతించక నే నుండినా జీవాంతరాత్ముఁడవై చేకొంటి నీవే ఆవటించి కీలుబొమ్మ అచేతనమై యుండినా ఆవేళ సూత్రధారుఁ డాడించుఁ గదవయ్యా | ॥హరి॥ |


