అధ్యాత్మ సంకీర్తన
రేకు: 209-2
సంపుటము: 3-50
రేకు: 209-2
సంపుటము: 3-50
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఎన్నఁడు దీరీ నీ తెందేపలు??? పన్నిన జీవుల బంధములు | ॥పల్లవి॥ |
| భారపుఁ జిత్తము ప్రవాహరూపము వూరెటి మదములు వూటెత్తె తీర వింద్రయపు దేహభ్రాంతులు కోరేటి కోర్కులఁ గొండలు వెరిగె | ॥ఎన్నఁ॥ |
| ఉడికేటి పాపము లుగ్రనరకములు తొడికేటి కర్మము తోడంటు విడువవు భవములు వెంటవెంటనే చిడుముడిఁ జిత్తము చీఁకటి వడెను | ॥ఎన్నఁ॥ |
| రపణపు భవములు రాట్నపుగుండ్రలు చపలపు బుద్ధులు జలనిధులు ఇపుడిదె శ్రీవేంకటేశుఁడ నీవే కపటము వాయఁగఁ గరుణించితివి | ॥ఎన్నఁ॥ |


