అధ్యాత్మ సంకీర్తన
రేకు: 210-2
సంపుటము: 3-56
రేకు: 210-2
సంపుటము: 3-56
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఈమాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను నేమమెంత నేమెంత నీ కరుణ యెంత | ॥పల్లవి॥ |
| సకలకర్మము చేత సాధ్యముగాని నీవు వొక ఇంచుకంత భక్తి కొగి లోనైతి ప్రకటించి బహువేదపఠనఁ జిక్కని నీవు మొకరివై తిరుమంత్రమునకుఁ జిక్కితివి | ॥ఈమా॥ |
| కోటిదానములచేత కోరి లోనుగాని నీవు పాటించి శరణంటేనే పట్టి లోనైతి మేటి వుగ్రతపముల మెచ్చి కైకొనని నీవు గాటపుదాసులై తేనే కైకొని మన్నించితి | ॥ఈమా॥ |
| పెక్కుతీర్థములాడిన బేధించరాని నీవు చొక్కి నీముద్రవారికి సులభుఁడవు గక్కన దేవతలకుఁ గానరాని నీవు మాకు నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి | ॥ఈమా॥ |


