అధ్యాత్మ సంకీర్తన
రేకు: 213-3
సంపుటము: 3-75
రేకు: 213-3
సంపుటము: 3-75
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| పరుసము సోఁకక పసిఁడౌనా పురుషోత్తముఁడే బుద్ధిచ్చుఁ గాక | ॥పల్లవి॥ |
| భువి భోగములకుఁ బుట్టిన దేహము వివరపు మోక్షము వెదకీనా యివల సకలమును యేలేటి దేవుఁడు తవిలి రక్షింపుట ధర్మముఁ గాక | ॥పరు॥ |
| బెరసి యాసలనే పెరిగేటి దేహము ధరఁ గొంతయినాఁ దనిసీనా అరుదుగ నంతర్యామగు దేవుఁడు పొరిఁ బెర రేఁచుటే పొందౌఁ గాక | ॥పరు॥ |
| ఘనమగు సంసారకారణ జీవుఁడు తన సుజ్ఞానముఁ దలఁచీనా వెనక మునుప శ్రీవేంకటపతియే కనుఁగొని మమ్మిటు కాచుటఁ గాక | ॥పరు॥ |


