అధ్యాత్మ సంకీర్తన
రేకు: 213-6
సంపుటము: 3-78
రేకు: 213-6
సంపుటము: 3-78
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే కన్నచోటనే వెదకి కానఁడింతే కాక | ॥పల్లవి॥ |
| యెక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము యిక్కడ హరి యున్నాఁడు హృదయమందె ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁడింతేకాక | ॥ఉన్న॥ |
| యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ కామించి యాతఁ డిన్నిటాఁ గలిగుండఁగా దోమటి సంసారపు దొంతికర్మములఁ జిక్కి కాముకుఁడై కిందుమీఁదు గానఁడింతేకాక | ॥ఉన్న॥ |
| యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయీ శ్రీవేంకటేశ్వరు సేవచేత నుండఁగా భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు కావరాన నిన్నాళ్లు కానఁడింతేకాక | ॥ఉన్న॥ |


