అధ్యాత్మ సంకీర్తన
రేకు: 214-1
సంపుటము: 3-79
రేకు: 214-1
సంపుటము: 3-79
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| కటకటా యేమిటాను కడవర గానఁడిదే నిటలపు వ్రాఁత యెట్టో నిజము దెలియదు | ॥పల్లవి॥ |
| బాదల సంసారము పరవంజుకొని తొల్లి యేది నమ్మి పాటువడె నీ జీవుఁడు గాదెల కొలుచుగాఁగఁ గట్టుకొని కర్మములు యేదెస చొచ్చీనో కాని యీ ప్రాణి | ॥కట॥ |
| కాఁపురమై తమ తల్లి కడుపున వచ్చి పుట్టె యే పని గలిగెనో యీ దేహి కాపాడీ నిక్షేపాలు కడునాసతోఁ బాఁతి యే పదవిఁ దానుండునో యీ జంతువు | ॥కట॥ |
| దవ్వుల యమబాదలు దలఁచి వెరవఁడిదె యెవ్వరి సలిగెనమ్మో యీ జీవి రవ్వగా శ్రీవేంకటాద్రిరాయఁడు మన్నించఁగాను యివ్వల బతికెఁగాక యెవ్వఁడోయి తాను | ॥కట॥ |


