అధ్యాత్మ సంకీర్తన
రేకు: 215-2
సంపుటము: 3-86
రేకు: 215-2
సంపుటము: 3-86
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఎంతగాలమునకైనా యీ యర్థమే కలది యింతటిలోననే హరి నెరఁగఁగవలయు | ॥పల్లవి॥ |
| యెంచి నూరేండ్లమీఁద యెప్పుడో మరణము ముంచి యిట్టే మోచీనదె మురికిడొక్క యించుకంత యిందుకుఁ గానేల కోరెమో సుఖము కాంచన మెవ్వరికిఁగా గడియించేమో | ॥ఎంత॥ |
| కలిగిన దినములు కాఁపురానకే సెలవు తలఁపెల్ల నాసలకంతటఁ గొలఁది (?) ఫల మిందు నేమిగద్దో ప్రాణి ఇందేమిటివాఁడో తెలిసి పాపఁగలేము తీరని యీ చిక్కు | ॥ఎంత॥ |
| సేసిన కర్మము లెల్లా చెప్పరాని మోపులాయ రాసికెక్కి యింద్రియాల పరమాయను వేసరి యిన్నిటికి శ్రీవేంకటేశుఁ గొలిచితి మాసినదే మణుఁగాయ మాకు నేది జన్మము | ॥ఎంత॥ |


