అధ్యాత్మ సంకీర్తన
రేకు: 218-6
సంపుటము: 3-101
రేకు: 218-6
సంపుటము: 3-101
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇందుకంటే మరి యిఁకలేదు హితోపదేశము వో మనసా అంది సర్వసంపన్నుఁడు దేవుఁడు ఆతని కంటే నేరుతుమా | ॥పల్లవి॥ |
| కల దొకఁటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది తలఁకక మీ శరణు చొచ్చి మీ దాసుడ ననెడి దొకమాఁట వలవని జోలే యింతాను వడి నిదిఁ గాక యేమిసేసినను సులభ మిందునే తొల్లిటి వారలు చూరలుగొనిరదే మోక్షంబు | ॥ఇందు॥ |
| మొదలొకటే యిన్నిటికి ముందర వెనకా వచ్చేది వొదుగుచు గోవిందుని దాసులకు నొక్కమాటే మొక్కినఁ జాలు తుద కెక్కనివే యితరములు దొరకొని మరేమి సేసినను బదికి లిరిందునే పరమవైష్ణవులు పలు చదువులలో వినరాదా | ॥ఇందు॥ |
| తగులొకటే విడువరానిది తతి నెన్నటికినిఁ జెడనిది వొగి శ్రీవేంకటపతి నామజపము వొకమాటే అబ్బినఁ జాలు నగుబాటే యింతాను నానాఁటి కేమేమి సేసినను తగు నీ బుద్ధుల నడచిరి మున్నిటి దైవజ్ఞులు పూర్వాచార్యులును | ॥ఇందు॥ |


