అధ్యాత్మ సంకీర్తన
రేకు: 238-1
సంపుటము: 3-216
రేకు: 238-1
సంపుటము: 3-216
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| ఏమిసేతు నాభాగ్య మిట్లున్నది నేమమేమీ నెరఁగను నీవే గతి యిఁకను | ॥పల్లవి॥ |
| అగపడి నిరంతర మలవాటైన జగత్తు మొగమునఁ గట్టినట్టు మొగి మరవనీదు తగిలి నిన్నెటువలె ధ్యానము సేతు నేను అగడు సేసి సహాయముగాదు మనసు | ॥ఏమి॥ |
| విడువక యెల్లప్పుడూ విడిదలైన దేహము మెడఁ గట్టినట్టున్నది మెలఁగీ నురులదు వొడయఁడ నీవూడిగె మొదిగి నేనెట్టు సేతు అడరి కప్పిన నీ మాయాఁ దోడుగాదు | ॥ఏమి॥ |
| వొద్దనే పెక్కుగాలము పూనిన పురాకృతము చద్దిమూఁటై యనుభవించఁగఁ జేసీ మానదు అద్దుక శ్రీవేంకటేశ అంతర్యామివి నీవు వొద్దికతో రక్షించు నావోజాఁ దోడుగాదు | ॥ఏమి॥ |


