అధ్యాత్మ సంకీర్తన
రేకు: 244-3
సంపుటము: 3-250
రేకు: 244-3
సంపుటము: 3-250
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| శరణు నేఁ జొచ్చినది సరి నీవు మన్నించేది యిరవైన గురుతుగా కిందుఁ గూడపెట్టేవా | ॥పల్లవి॥ |
| యెంగిలినోరు వెట్టుక యే మాటలాడినాను సంగతిగా నవి నేఁడు సత్యమయ్యీనా అంగనల మోహము నాయంతరంగానఁ బెట్టుక ముంగిటి ఆచారాలు ముఖ్యమయ్యీనా | ॥శర॥ |
| ఆసలు మెడఁగట్టుక అన్ని యుఁ జదివినాను దోసములెల్లా మాని దొరనయ్యేనా రోసాలు మదిఁబెట్టుక రోఁతమేను గడిగితే వేసాలయ్యే తోఁచుఁగాక వేరే పుణ్యమున్నదా | ॥శర॥ |
| ఘనసంసారము మోచి కర్మమెంత సేసినాను తను దా జన్మించినట్టి తప్పు దీరీనా యెనలేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి తనిసితి నిఁక నేను తమకించేనా | ॥శర॥ |


