అధ్యాత్మ సంకీర్తన
రేకు: 245-4
సంపుటము: 3-257
రేకు: 245-4
సంపుటము: 3-257
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| కమ్మరను జీవునికిని ఇది కారణ మేమియు లేదట ఇమ్ముల రాజూ నెరఁగని వెట్టెట యెవ్వరికెక్కును నారాయణా | ॥పల్లవి॥ |
| యిలలో జీవుని విషయభోగమున నెందునుఁ బొరయనివాఁడవట చలమా యేల పుట్టించితివీ సంసారవారిధిని కలకాలము నీగర్భగోళమునఁ గాఁపురముండఁగ నిటు చేసి ఫలమేమి గట్టుకొంటివి భావము దెలుపవే నారాయణా | ॥కమ్మ॥ |
| నడపెడి యీ జగములన్నియును నటనలు నీవట తొలుతనే యెడయక యిందే వినోదించెదవు యెడ్డతనంబా నీకేమి జడియక నీవే సేసిన చేఁతలు సర్వమును నిలుపఁగవలదా కడుగఁగనేఁటికి నెంగిలిబూరెట కడవేయనేల (?) నారాయణా | ॥కమ్మ॥ |
| పరగిన యీ కర్మమార్గములు బంధహేతువని చెప్పితివి యిరవుగను వేదమార్గములు నేలా కాచుక తిరిగెదవు గరిమల శ్రీవేంకటేశ్వర యిచ్చాకల్పితములు యిన్నియు నీకు హరినెరిగించితివిఁక నీచిత్తము సర్వేశ్వర వో నారాయణా | ॥కమ్మ॥ |


