అధ్యాత్మ సంకీర్తన
రేకు: 245-6
సంపుటము: 3-259
రేకు: 245-6
సంపుటము: 3-259
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇంతకంటె ఘన మిఁక లేదు సంతతసౌఖ్యము జనార్దనుఁడే | ॥పల్లవి॥ |
| భయనివారణము పరమాత్ముని నుతి జయకారణ మీశ్వరచింత అయుతపుణ్యఫల మచ్యుతునిసేవ క్రియతో నిజ మెరిఁగినవారికిని | ॥ఇంత॥ |
| కర్మహరము శ్రీకాంతు దరిశనము ధర్మరాసి మాధవుశరణు అర్మిలి సంపద లనంతుని తగులు నిర్మలముగఁ బూనిన దాసులకు | ॥ఇంత॥ |
| ఆగమోక్తమీ హరికైంకర్యము భోగము విష్ణునిపూజ యిది యోగము శ్రీవేంకటోత్తముని కొలువు బాగులు నేర్చిన ప్రపన్నులకును | ॥ఇంత॥ |


