అధ్యాత్మ సంకీర్తన
రేకు: 246-2
సంపుటము: 3-261
రేకు: 246-2
సంపుటము: 3-261
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఇందరు నెఱుఁగుదు రీయర్థమే భువి కందువఁ దగులుట కర్మము కొలఁది | ॥పల్లవి॥ |
| ఆదికి ననాది హరిదాస్యంబిది వేదాంతంబుల వెలసినది సోదించి కనిరి శుకనారదాదులు పాదుగఁ నిఁకఁ దమ భాగ్యముకొలఁది | ॥ఇంద॥ |
| అతిరహస్యమిది అచ్యుతుపై భక్తి ప్రతిలేని పరమపావనము చతురులై తెలిసిరి సనకాది మునులు తతి దొరకుట సుకృతఫలము కొలఁది | ॥ఇంద॥ |
| పరము శ్రీవేంకటపతి సంకీర్తన సొరిది గురుఁడొసఁగు సూక్ష్మమిది చిరపుణ్యులు మును చేకొన్న నిజమిది మరిగి మనుట తమ మనసుల కొలఁది | ॥ఇంద॥ |


