అధ్యాత్మ సంకీర్తన
రేకు: 246-3
సంపుటము: 3-262
రేకు: 246-3
సంపుటము: 3-262
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళవసంతం
| ఎన్నికై శ్రీవేంకటేశుఁ డితడు గలుగఁగానె అన్నిటా నందరిలోని అజ్ఞానాలుఁ బాసెను | ॥పల్లవి॥ |
| సకలశాస్త్రములందు సందేహమే కాని వొకరు దైవమహిమ కొడఁబడరు అకటా బాస చేసినయందుకైనా నమ్మరు వికలచిత్తులెల్లాను విష్ణుదాస్యమునకు | ॥ఎన్ని॥ |
| గక్కనఁ గర్మము చేసి కడు నలయుటే కాని వొక్కమాటు హరిఁ బాడ నొడఁబడరు తక్కక పెద్దలుగాఁగ తల వణఁకుటే కాని పుక్కటికాండ్లు హరిఁ బూజించనేరరు | ॥ఎన్ని॥ |
| చిత్తములో వివేకించి చింతఁ బొరలుటే కాని వొత్తి హరిపై భార మొప్పగించరు హత్తిన శ్రీవేంకటేశుఁ డటె దయ దలఁచఁగా మత్తిలి ప్రపన్నులెల్లా మరేమిటాఁ దప్పరు | ॥ఎన్ని॥ |


