అధ్యాత్మ సంకీర్తన
రేకు: 246-4
సంపుటము: 3-263
రేకు: 246-4
సంపుటము: 3-263
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| వానివాని సహజము వద్దననేల యీ నేటి ప్రపంచ మది యేమి సేయఁగలదు | ॥పల్లవి॥ |
| హరి పుట్టించినయట్టి ఆయాప్రకృతులను విరసాలఁ దిప్పెమంటే వేరొకటౌనా పరమజ్ఞాన మొక్కటే పాటించితేఁ జాలు యెరవుల పుణ్య పాపాలేమి సేయఁగలవు | ॥వాని॥ |
| బలువుగ విష్ణు మాయఁ బ్రబలే సంసారమును చలమున దిద్దఁబోతేఁ జక్కనౌనా తెలివితో హరిభ క్తి తెగక వుండితేఁ జాలు యిలపైఁ బంచేంద్రియములేమి సేయఁగలవు | ॥వాని॥ |
| శ్రీవేంకటేశుఁ డాత్మఁ జేకొని వుండినది భావించకున్న నాతఁడు బడివాసీనా సావధానాన నీతని శరణనుకొంటేఁ జాలు యే విధులు భవములునేమి సేయఁగలవు | ॥వాని॥ |


