అధ్యాత్మ సంకీర్తన
రేకు: 251-1
సంపుటము: 3-290
రేకు: 251-1
సంపుటము: 3-290
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| హేయము తన వాసనలేల మానును చీ యన్న మానదిదే చెప్పరాని మాయ | ॥పల్లవి॥ |
| జంగిలిమనుజునకు సరుఁస బాపమే చవి అంగవించవలదంటే నగ్గలమౌను ముంగిట నిల్లాలుండఁగ ముట్టగోరుఁ బరస్త్రీల యెంగిలి కీరెండు సరే యిదివో మాయ | ॥హేయ॥ |
| పరగిన జీవునికి పంచేంద్రియాలే సుఖము ధర నెంత గాలమైన తనివి లేదు సిరులు దనకుండినాఁ జేయిచాఁచుఁ బరులకు యిరువు లెరఁగరాదు యిదివో మాయ | ॥హేయ॥ |
| శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యాత్మలో నుండఁగ భావించు నితని కృప ఫలించునాఁడు పూవువంటి సంసారము పొదుగుక వుండఁగాను ఆవటించుఁ బుణ్యఫలాలదివో మాయ | ॥హేయ॥ |


