అధ్యాత్మ సంకీర్తన
రేకు: 251-2
సంపుటము: 3-291
రేకు: 251-2
సంపుటము: 3-291
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఆతఁడు సేసే చేఁత లన్యులు సేయఁగలరా జాతుల మనుజులెల్లా సతమయ్యేరా | ॥పల్లవి॥ |
| దిక్కులేనివారికెల్లా దేవుఁ డొక్కఁడే దిక్కు చిక్కినవారికినెల్లా శ్రీపతే గతి తక్కిన అనాథులకు దైవమే రక్షకుఁడు యెక్కడా నాతఁ డుండఁగా నేఁటి కిఁక చింత | ॥ఆతఁ॥ |
| బలిమి లేనివారికి పరమాత్ముఁడే బలిమి కలిమి చాలనివారి కలిమి హరె యిల నేరనివారికి నిందిరానాథుఁడే నేర్పు వెలసీతనికే విన్నవించుటింతే కాక | ॥ఆతఁ॥ |
| పొందులేనివారికెల్లాఁ బురుషోత్తముఁడే పొందు విందును వేడుకయు శ్రీవేంకటేశుఁడే యెందరెందరుండినాను యీతఁడు గలఁడు మాకు సందడి నాతఁడే అన్ని చక్కఁబెట్టీఁ బనులు | ॥ఆతఁ॥ |


