అధ్యాత్మ సంకీర్తన
రేకు: 252-2
సంపుటము: 3-297
రేకు: 252-2
సంపుటము: 3-297
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| ఎందుకుఁ బనిగొందము యేమి సేతమివి యెల్లా చెందిన మాకిఁక బుద్ధి చెప్పవే నారాయణా | ॥పల్లవి॥ |
| హరినామ మొకటనే అణఁగెఁ బాపములు వొరసి యన్నినామము లూరకున్నవి సిరులిచ్చెఁ గలవెల్లా శ్రీపతినామ మొకటే పెరనామములెల్లా పెట్టెలలో నున్నవి | ॥ఎందు॥ |
| గోవిందనామ మొకటే కూడపోసెఁ బుణ్యములు వేవేలు నామములకు వెలలున్నవా శ్రీవిష్ణునామ మొకటే చేతికిచ్చె వైకుంఠము తావైయున్న నామములు తమకించీ నీవికి | ॥ఎందు॥ |
| ఇత్తల కేశవునామ మియ్యఁగలవెల్లా నిచ్చె పొత్తుల నామములెల్లాఁ బొంచుకున్నవి చిత్తమున నిన్నుఁ జూపె శ్రీవేంకటేశ నామమే హత్తిన నామములెల్లా నందులోనే వున్నవి | ॥ఎందు॥ |


