Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 254-5
సంపుటము: 3-312
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
ఇదిగా దదిగా దిన్నియు నింతే
పదిఁ బది హరి నీపదమే నిజము
॥పల్లవి॥
సురలును నసురలు చూపట్టు రాజులు
అరసి కనక(ఁగ?) గతమగువారె
సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి
కెరలి పరుల రక్షింపఁగఁగలరా
॥ఇది॥
పదునాలుగవది బ్రహ్మలోకమును
కదిసి నీరుమునుకల పొలము
చెదరక యిఁకఁ దముఁ జేరినవారల
వుదుటున నిముడుక వుండఁగఁగలరా (దా?)
॥ఇది॥
అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది
యిచ్చట శ్రీవేంకటేశుఁడవు
చొచ్చిరి నీశరణు శుకసనకాదులు
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా
॥ఇది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము