అధ్యాత్మ సంకీర్తన
రేకు: 258-3
సంపుటము: 3-333
రేకు: 258-3
సంపుటము: 3-333
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఒక్కఁ డెవ్వఁడో వుర్వికి దైవము యెక్కువ నాతని నెరఁగవో మనసా | ॥పల్లవి॥ |
| వొట్టిన జీవుల కొక బ్రహ్మ గలఁడు పట్టిన విప్రులు బ్రహ్మలమందురు నట్టనడుమవారే నవబ్రహ్మలు జట్టిగ బ్రహ్మల సంతాయ జగము | ॥ఒక్కఁ॥ |
| కైలాసంబునఁ గలఁ డొక రుద్రుఁడు తాలిమి నేకాదశరుద్రులు మరి కాలరుద్రుఁడును కడపట నదివో చాలిన రుద్రుల సంతాయ జగము | ॥ఒక్కఁ॥ |
| అవతారంబున నలరిన విష్ణువు అవలవిష్ణుమయమనియెడి విష్ణువు భువి శ్రీవేంకటమున నున్నాఁ డిదె జవళి వరంబుల సంతాయ జగము | ॥ఒక్కఁ॥ |


