అధ్యాత్మ సంకీర్తన
రేకు: 258-6
సంపుటము: 3-336
రేకు: 258-6
సంపుటము: 3-336
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఎన్నఁడు దెలిసే మెచ్చరికెపుడో ఇన్నియుఁ గన్నవె యెఱిఁగీ నెఱఁగ | ॥పల్లవి॥ |
| నిన్నటియాఁకలి నేఁడూ నున్నది కన్నదినంబే కడచనెను పన్ని నిదుర మాపటికి నున్నదదె యెన్నఁగ రాతిరి యెందో పోయ | ॥ఎన్నఁ॥ |
| కాయపు సుఖములు గంపల నున్నవి పాయమే కైవాలి పండెనదే యీయెడ సంసార మింటనే వున్నది చేయును నోరును చెనటై నిలిచె | ॥ఎన్నఁ॥ |
| విడువని జన్మములు వెంటనే వచ్చీ తడవేటి మోక్షము దవ్వాయ యెడపక శ్రీవేంకటేశ నీ మఱఁగు బడిఁ జొచ్చితి నా భారము నీది | ॥ఎన్నఁ॥ |


