అధ్యాత్మ సంకీర్తన
రేకు: 259-2
సంపుటము: 3-338
రేకు: 259-2
సంపుటము: 3-338
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నాలో నున్నాఁడవు నన్నుఁ గావ(క) నీకుఁ బోదు యీలీలఁ బట్టుచీరెరవిచ్చిన వానివలె | ॥పల్లవి॥ |
| చుట్టుకొంటిఁ గర్మములు సొరిదిఁ బసిరికాయ నట్టనడిమి పురువునడకవలె వట్టిజాలిఁ దిరిగితి వడిఁ బంచేంద్రియముల పట్టిన నీటిలో జలభ్రమణమువలెను | ॥నాలో॥ |
| ధరలోనఁ బుట్టి పుట్టి తగ వచ్చినందే వచ్చి వరుస రాట్నపుగుండ్రవలె నైతిని అరసి నే నంటుకొంటి అంగనల పొందులను చొరఁబారి వేలుకాడే సూదిరాతివలెను | ॥నాలో॥ |
| అంతటను స్వర్గనరకాదిలోకాలు మెట్టితి బంతిగట్టి నురిపెడి పసురమునై చెంతల శ్రీవేంకటేశ చేరితి నీవద్ద నేఁడు వంతుకుఁ గామధేనువు వద్ది దూడవలెను | ॥నాలో॥ |


