అధ్యాత్మ సంకీర్తన
రేకు: 266-3
సంపుటము: 3-379
రేకు: 266-3
సంపుటము: 3-379
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే మున్నె నా భావముతో ముడిచివేసినది | ॥పల్లవి॥ |
| చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి ములిగి ముక్తిదలఁచి ముక్తుఁడనైతి పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి చెలఁగి శ్రీపతిఁ దలఁచి వైష్ణవుఁడనైతి | ॥అన్ని॥ |
| పొసఁగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి పసలఁ బాపముచేసి పాపకర్ముఁడనైతి వెస బ్రహ్మచారినైతి వేరె యాచారమున ముసిపి మరొకాచారమున సన్యాసినైతి | ॥అన్ని॥ |
| వొగి నొడ్డెభాషలాఁడి వొడ్డెవాఁడనైతిని తెగి తెలుఁగాడ నేర్చి తెలుఁగువాడనైతి అగడై శ్రీవేంకటేశ అన్నియు విడిచి నేను తగు నీదాఁసుడనై దాసరి నేనైతి | ॥అన్ని॥ |


