అధ్యాత్మ సంకీర్తన
రేకు: 268-1
సంపుటము: 3-389
రేకు: 268-1
సంపుటము: 3-389
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| చంకగుదియ యిదే శరణార్తి నే నిదే తెంకి నా భావము దేవుఁడే యెరుఁగు | ॥పల్లవి॥ |
| కోరెడి చిత్తము కోరక మానదు వైరాగ్యము నే వదలను యీరీతి దినములు యిట్లనే కడచీ తేరిన పను లిఁక దేవుఁడే యెరుఁగు | ॥చంక॥ |
| తగు సంసారము తనువునఁ బెనఁగీ వెగటై మోక్షము వెదకేను పగటున రెంటాఁ బరగిన జీవుఁడు తెగువలుఁ దగులమి దేవుఁడే యెరుఁగు | ॥చంక॥ |
| పంచేంద్రియములు పారీ నిక్కడ పెంచఁ బెద్దనై పెరిగేను అంచెల శ్రీవేంకటాధిపుఁ గొలిచితి దించని యీమాయ దేవుఁడే యెరుఁగు | ॥చంక॥ |


