అధ్యాత్మ సంకీర్తన
రేకు: 24-2
సంపుటము: 1-144
రేకు: 24-2
సంపుటము: 1-144
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| సులభమా మనుజులకు హరిభక్తి వలనొంది మరికదా వైష్ణవుఁడౌట | ॥సులభమా॥ |
| కొదలేని తపములు కోటానఁగోటులు సదన నాచరించి యటమీఁద పదిలమైన కర్మబంధము లన్నియు వదలించుకొనికదా వైష్ణవుఁడౌట | ॥సులభమా॥ |
| తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య అనఘుఁడై చేసిన యటమీఁద జననములన్నిట జనియించి పరమపా- వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట | ॥సులభమా॥ |
| తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు నరలేక సేవించి నటమీఁద తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట | ॥సులభమా॥ |


