శృంగార సంకీర్తన
రేకు: 1908-1
సంపుటము: 29-43
రేకు: 1908-1
సంపుటము: 29-43
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| అది యెవ్వతె తాను అలమేల్మంగను నేను పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చేఁ గాని | ॥పల్లవి॥ |
| పొలఁతి నీ కెవ్వతె బుద్దులు చెప్పినది నలుపున నాపతితో నవ్వుమంటాను తెలుపఁగదవే దాని దీమస మెంతో చలములో నీతో మరి సాదించేఁగాని | ॥అది॥ |
| నీ కెవ్వతె యీ చేఁతలు నేరిపినది జోకతో నా రమణుని సాలయుమని నాకుఁ జూపనే దాని విన్నాణ మెంతో మైకొని నీతో మరి మాఁటలాడేఁగాని | ॥అది॥ |
| వోడక యెవ్వతె నీ కీ వుపదేశ మిచ్చినది యీడ నాశ్రీవేంకటేశు నెనయుమని వాడలో నెంచవే దాని వాసి యంతో యీతఁడు కూడె నన్ను నీతో మరి గుట్టు చెప్పేఁగాని | ॥అది॥ |


