శృంగార సంకీర్తన
రేకు: 1909-3
సంపుటము: 29-51
రేకు: 1909-3
సంపుటము: 29-51
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| కంటిరటె చెలులాల కన్నుల పండుగ లివి వెంట వెంట వచ్చెనమ్మ వెస నీకె సుద్దులు | ॥పల్లవి॥ |
| సన్నపుఁజెమట లుబ్బి చన్నులపై జాలువారె కన్నులఁ దేటలుదేరె కాంతకును చిన్ని పెదవులవెంట చిరునవ్వు లిదె వూరె యెన్నఁ గతలాయనమ్మ ఇప్పు డీకె సుద్దులు | ॥కంటి॥ |
| కడువేడుకలతోడ కళలు మోమున నిక్కె తడఁబాటు కోరికలు తలకెక్కెను పడఁతి కాతనిపేరు పైపై పెదవులఁ జిక్కె అడియాలా లాయనమ్మ అట్టె యీకె సుద్దులు | ॥కంటి॥ |
| చెక్కిటికిఁ జేయి వచ్చె సిగ్గులు లోలో హెచ్చె మిక్కుటపుఁగొప్పు వీఁపుమీఁదికి వచ్చె యిక్కడ శ్రీవేంకటేశుఁ డిదె యలమేలుమంగ దక్కఁగూడె నౌనమ్మ తగు నీకె సుద్దులు | ॥కంటి॥ |


