శృంగార సంకీర్తన
రేకు: 1909-4
సంపుటము: 29-52
రేకు: 1909-4
సంపుటము: 29-52
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఇంత జాణవు గాఁగానే యింతులు వలచిరి సంతోసించి రీడనున్న సతులెల్లా నిన్నును | ॥పల్లవి॥ |
| ఆయములెత్తి యాడి యతివ నన్ను దూరితే చాయగా పాటుసేసుకొని సారె నవ్వేవు నీయందు నేరాలు మోపి నీకుఁ దారుకాణించితే యీయకోలు సేసుకొని ఇచ్చగించేవు | ॥ఇంత॥ |
| వొల్లనే యానలు వెట్టవొద్దని పెనఁగితేను చెల్లుబడిసేసుకొని చేయివట్టేవు పల్లదాన వెంగేలకు పలుమారు మొక్కితేను వెల్లవిరిసేసుకొని వేడుకపడేవు | ॥ఇంత॥ |
| అందరిలో నిమ్మపంట నట్టె నిన్ను వేసితేను చందములుసేసుకొని సమ్మతించేవు కందువ శ్రీవేంకటేశ కలికి నిన్నొరసితే చెందెకూడి యదే గురిసేసుకొనేవు | ॥ఇంత॥ |


