శృంగార సంకీర్తన
రేకు: 1909-5
సంపుటము: 29-53
రేకు: 1909-5
సంపుటము: 29-53
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఆఁటదాని కింతగద్దా అగడు సేసెఁగాక జూటరి దీని విద్యలు చూడరమ్మా సతులు | ॥పల్లవి॥ |
| చిగురుఁ బెదవిమీఁద చిన్నిముద్దుమాఁట లాడీ మగనితో నించుకంతా మరఁగలేక తెగనివలపు చల్లి తీగె నవ్వులు నవ్వీ సొగిసే దీవి వుదుటు చూడఁ గొత్తలాయను | ॥ఆఁట॥ |
| తమ్మికన్నులు దెరచి తళుఁకుఁ జూపులఁ జూచీ కమ్మటఁ బతి యెదుట గర్వమునను సొమ్మలెల్లాఁ జూపుకొంటా జోలి మొక్కులు మొక్కీ యెమ్మెలదీనివేసాల కేమందు నేను | ॥ఆఁట॥ |
| కావరపు గుబ్బలు సోఁకఁగ సేవలెల్లాఁజేసీ శ్రీవేంకటేశుఁ డెదుట సిగ్గువడక వావితో నన్నితఁ డేలె వట్టిసన్నలు తాఁజేసీ భావించి దీని గజరు పచ్చిఁ దోచె నిపుడు | ॥ఆఁట॥ |


