Display:
శృంగార సంకీర్తన
రేకు: 1910-6
సంపుటము: 29-60
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఎగ్గు సిగ్గు లెఱఁగరు యెదుట నెవ్వరున్నాను
బెగ్గిలక తమకమే పెంతురుగాని
॥పల్లవి॥
అలతురు సొలతురు అంగనలిఇనవారు
వలచిన పతితోను వద్దననేలే
పిలుతురు సన్నసేసి పెనఁగులాడుదురు
చెలులాల యెరుకలు సేసుకొన నేలే
॥ఎగ్గు॥
కన్నుల జంకింతురు కాఁగిలించుకొందురు
మన్ననలగలవారిని మానుపరాదే
చన్నులు మోపుదురు సారె మర్మా లంటింతురు
కన్నెలాల మీరు వారిఁ గనుఁగొన నేలే
॥ఎగ్గు॥
మోములుచూచుకొందురు ముచ్చటతోనవ్వుదురు
కాముకుల రవ్వసేయఁ గారణమేమే
యీమేర శ్రీవేంకటేశుఁ డిందిరయుఁ గూడినారు
భామలాల మీరింత పచారించ నేలే
॥ఎగ్గు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము